బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై బురదజల్లడంలో భాగంగానే ఆయన బావమరిదిపై డ్రగ్స్ కేసంటూ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆదివారం మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు ఇది పరాకాష్ట అని మండిపడ్డారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే జన్వాడ ఫాంహౌజ్‌లో డ్రగ్స్ పార్టీలు జరిగాయంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.