రాజేంద్రనగర్ సర్కిల్ పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 191 వద్ద మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్ వైపు వచ్చే దారిలో రోడ్డు పక్కన ఉన్న కల్వర్ట్ వద్ద సోమవారం ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జి. రాజేందర్ గౌడ్, ఎస్ఐ ఎస్. రాజేందర్, కానిస్టేబుల్ సురేశ్, హెచ్. జి. చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.