విద్యుత్ మరమ్మతు పనుల కారణంగా సరఫరాలో అంతరాయం ఉంటుందని నార్సింగి ఏఈ మణికంఠ తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 11. 30 వరకు రాందేవూడ, వన్మోర్ నగర్, నెక్నాంపూర్ గ్రామం, ఫెయిర్ ఫీల్డ్ కాలనీ, ఈవీవీ కాలనీ, పాయనీర్ ఎస్టేట్, వైఎస్సార్ కాలనీ, పాషాకాలనీ, అలిజాపూర్, వెంకటేశ్వర కాలనీల్లో విద్యుత్ ఉండదన్నారు.