రహదారుల విస్తరణపై రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హెచ్ఆర్డీసీ అధికారులతో మంగళవారం సమీక్షించారు. శంషాబాద్, నార్సింగి పరిధిలో మొత్తం 200 కోట్ల 25 లక్షల నిధులతో విస్తరించనున్న రహదారుల గురించి ఆయన సంబంధిత అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. శంషాబాద్ పట్టణంలో జీఎంఆర్ స్కూల్ మలుపు నుంచి రైల్వేగేటు, స్టాప్ నుంచి ఒయాసిస్ స్కూల్ వరకు, తొండుపలి నుంచి ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డు వరకు విస్తరించే పనులపై ఆరా తీశారు.