బెంగళూరు నుండి వారణాసి వెళ్తున్న ఆకస ఎయిర్ లైన్స్ విమానానికి మంగళవారం రాత్రి బాంబు బెదిరింపు మెసేజ్ లు చేశారు. వెంటనే విమానం అత్యవసరంగా పైలెట్ శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశాడు. అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ భద్రత అధికారులు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం బృందాలతో విమానంలో సోదాలు చేసి ఫేక్ గా విమానాశ్రయ అధికారులు గుర్తించారు. ఫేక్ మెసేజ్ లు చేసిన గుర్తుతెలియని వ్యక్తుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.