జవహర్ నగర్: ఇంట్లో అకస్మాత్తుగా కరెంట్ షాట్ తగిలి బాలుడు మృతి
మేడ్చల్ నియోజకవర్గం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ బాలుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. కాప్రా మండలం జవహర్ నగర్ ప్రగతినగర్లో నివాసముండే శానమ్మ కొడుకు వరుణ్ (7) శుక్రవారం సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి టీవీ చూస్తున్నాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగి పడి మంటలు అంటుకోవడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగినపుడు కుటుంబ సభ్యులెవరూ లేరు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.