మేడ్చల్ వరకు మెట్రోను విస్తరించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ డిమాండ్ చేశారు. మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం జీడిమెట్లలో గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన మహ ధర్నా కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ హయంలో కొంపల్లి, మేడ్చల్ ప్రాంతాలలో పాటు తుంకుంట, శామీర్ పేటకు మెట్రో విస్తరణపై సర్వే సంస్థలను ఎంపిక చేసి పనులను అప్పగించమని చెప్పుకొచ్చారు.