మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో అంతర్గత డ్రైనేజీలు పొంగి నీరు రోడ్డు పైకి వస్తుండడంతో దుకాణ యాజమాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ దుర్గంధంతో రావడంతో ప్రజలు దుకాణాలకు రావడం లేదని అలాగే ఆ దారిలో ప్రయాణించే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు మంగళవారం కోరుతున్నారు.