
శామీర్పేట: ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి
శామీర్పేటలో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బుధవారం ఓ వృద్ధురాలు మృతి చెందింది. పోలీసుల వివరాలు ప్రకారం.. ములుగు మండలం లక్ష్మక్కపల్లికి చెందిన చిరబోయిన శివమ్మ (70) శామీర్పేట బస్టాండ్ వద్ద బస్సు కోసం ఎదురుచూస్తోంది. సిద్దిపేట వైపు వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు వృద్ధురాలిని ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.