బొడుప్పల్ లో బుధవారం ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని మేయర్ తోటకూర అజయ్ యాదవ్, కమిషనర్ రామలింగంతో కలిసి ప్రారంభించారు. సర్వేలో భాగంగా సమాచారం అడుగుతారని, వారికి పూర్తిగా సహకరించాలని కోరారు. ఒక్కో కుటుంబాన్ని 75 ప్రశ్నలు అడుగుతారన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్, కార్పొరేటర్లు కొత్త చందర్ గౌడ్, బింగి జంగయ్య యాదవ్, సింగిరెడ్డి పద్మారెడ్డి పాల్గొన్నారు.