బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని బీజేపీ గిరిజన మోర్చ నాయకులు అన్నారు. తెలంగాణ బీజేపీ గిరిజన మోర్చ అధ్వర్యంలో సోమవారం మేడ్చల్ జిల్లా సుచిత్రలో బీజేపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చ రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ నాయక్, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.