BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సృహ తప్పి పడిపోయారు. హుజురాబాద్లో అంబెడ్కర్ చౌరస్తా వద్ద దళిత బంధు రెండవ విడుత డబ్బులు విడుదల చేయాలని కౌశిక్ రెడ్డి ధర్నాకు దిగారు. దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించారు. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డి సృహ తప్పి పడిపోయాడు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.