మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని అన్నారం క్రాస్ రోడ్ వద్ద సోమవారం ఉదయం వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఓ బైక్ ను బోర్ వెల్ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న ఫోటోగ్రాఫర్ కూన వరుణ్(20) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధి సూరారం వాసిగా అక్కడి పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.