ట్రాన్స్ జెండర్ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ వికలాంగుల కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధర్ థెరిస్సా కాలనీలో నివాసం ఉంటున్న సరిత అలియాస్ సంతోష్(33) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.