కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారంలో ఆదివారం భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. విగ్రహాలను తయారు చేసే షేడ్డులోకి కొండచిలువ రావడంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. గమనించిన స్థానికులు వెంటనే స్నేక్ సొసైటి వారికి సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్ రాజు అక్కడికి చేరుకుని భారీ ఆకారంలో ఉన్న కొండచిలువను బందించారు. అనంతరం దానిని అడవిల్ వదిలిపెట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.