మాడుగుల మండలం నాగిళ్ల గ్రామ శివారులో శనివారం అక్రమంగా ఆటోలో తరలిస్తున్న తొమ్మిది క్వింటాళ్ల పీడీఎఫ్ బియ్యాన్ని పట్టుకొని స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు సీఐ వేణుగోపాలరావు చెప్పారు. అక్రమంగా బియ్యం తరలిస్తున్న సమాచారం మేరకు ఆటోను తనిఖీ చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకొని ఆటో డ్రైవర్ జెనిగల మహేష్ పై కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.