మహేశ్వరం నియోజకవర్గంలోని జల్ పల్లి మున్సిపాలిటీలో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురుసింది. ఏకధాటిగా కురిసిన వర్షంతో మున్సిపాలిటీలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడ్డారు. మున్సిపాలిటీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.