మహేశ్వరం నియోజకవర్గం లోని గ్రామీణ రోడ్లకు (కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్ సీఆర్ఆర్) 17 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని మాజీ ఎమ్మెల్యే కెఎల్ఆర్ హర్షం వ్యక్తం చేశారు. మహేశ్వరం, కందుకూరు మండలాల్లో బీటీ రోడ్ల విస్తరణ, బ్రిడ్జిల మరమ్మతులకు ఈ నిధులు వియోగిస్తామని కిచ్చెన్న తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్య మంత్రికి, మంత్రులకు కెఎల్ఆర్ ధన్యవాదాలు తెలిపారు.