మానసిక ఒత్తిడితో వ్యక్తి ఆత్మహత్య
రెండేళ్లుగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వ్యక్తి ఇంట్లో ఫ్యానుకు తాడుతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ ఠాణా పరిధిలో జరిగింది. అచ్చంపేట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి రెండేళ్లుగా బంజారాహిల్స్ రోడ్ నంబరు 10లోని ఐపీఎస్ క్వార్టర్స్ సమీపంలో నివసిస్తున్నారు. కొంత కాలంగా వివిధ పోటీపరీక్షలకు హాజరుకాగా ఎంపిక కాకపోవడం తల్లిదండ్రుల మరణంతో కుంగిపోయాడు. దింతో గురువారం ఆత్మహత్య చేసుకున్నారు.