వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ది సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ 10 లక్షల రూపాయల విరాళం అందించింది. సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ కె. వెంకట సుబ్బయ్య, డైరెక్టర్ ఎ. సోమలింగం గౌడ్ శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందించారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు.