హైదరాబాద్: అర్టికల్ 370 విషయంలో పునరాలోచన లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. పదేళ్ల భాజపా పాలనలో భారతదేశం అంతర్జాతీయంగా బలపడుతోందన్నారు. కాంగ్రెస్ హయాంలోనే మూసీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలు వెలిశాయని.. 40ఏళ్లుగా అక్కడ నివాసం ఉంటున్న వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వమే అన్ని వసతులు కల్పించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.