ఆడపిల్ల పుడితే రూ.5 వేలు.. సర్పంచ్ ఎన్నికల మేనిఫెస్టో

76பார்த்தது
ఆడపిల్ల పుడితే రూ.5 వేలు.. సర్పంచ్ ఎన్నికల మేనిఫెస్టో
తెలంగాణ పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే సర్పంచ్ ఆశావాహులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా.. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలో ఓ యువ నాయకురాలు ఎన్నికల మేనిఫెస్టో సైతం విడుదల చేశారు. ఈ క్ర‌మంలోనే గ్రామంలోని ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా 5 వేల ఆర్థిక సాయం, ఆడపడుచు పెళ్లి కానుక వంటి అంశాల‌తో మేనిఫెస్టో విడుదల చేశారు. కాగా.. ఈ మేనిఫెస్టో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

தொடர்புடைய செய்தி