టాలీవుడ్ హీరో నారా రోహిత్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. సీఎం చంద్రబాబు తమ్ముడి కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ‘బాణం’ అనే తన ఫస్ట్ మూవీతోనే మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. కాగా, నారా రోహిత్ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈనెల 13న నిశ్చితార్థం జరగనుందని ప్రచారం జరుగుతోంది. ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.