రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతోంది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
అశోక్ నగర్లో గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, ఇతర బీఆర్ఎస్ నేతలను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రూపు-1 అభ్యర్థులపై లాఠీ ఛార్జ్ చేసిన అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ బండిలో ఎక్కించి స్థానిక పీఎస్ కు తరలించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతోందని ప్రభుత్వంపై ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.