ఉపాధ్యాయులకు షరతు విధించిన బీహార్ ప్రభుత్వం

68பார்த்தது
ఉపాధ్యాయులకు షరతు విధించిన బీహార్ ప్రభుత్వం
ఉపాధ్యాయులకు బీహార్ ప్రభుత్వం షరతు విధించింది. ఇకపై స్కూల్‌కి ఉపాధ్యాయులు ఎవరూ కూడా టీ షర్టులు, జీన్స్ ప్యాంట్స్ ధరించి రాకూడదని ఆదేశాలు జారీ చేసింది. అన్ని విద్యా సంస్థల్లోనూ టీచర్లు పద్దతిగా దుస్తులు ధరించాలని సూచించింది. టీచర్లే పద్ధతిగా లేకుంటే పిల్లలు ఎలా ఉంటారని తెలిపింది. అంతేగాకుండా రీల్స్, షార్ట్స్ చేయటాన్ని సైతం నిషేధించింది. ఎవరైనా ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

தொடர்புடைய செய்தி