కలెక్టర్ ను కలిసిన ఎంఐఎం ఎమ్మెల్యేలు
చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ సోమవారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టితో సమావేశమయ్యారు. మూసీలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్న నేపథ్యంలో కలెక్టర్ దృష్టికి బాధితుల సమస్యలను తీసుకెళ్లారు. ముందుగా నోటీసులు ఇచ్చి వారి సమ్మతితోనే కూల్చివేతలు చేపట్టాలన్నారు. పేదలను రోడ్డుపై పడేయడం సరికాదన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్నారు.