వైద్యరంగంలో ఫార్మాసిస్టులకు ఎంతో డిమాండ్ ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం సుల్తాన్ ఉల్ ఉలూమ్ కాలేజీ ఆఫ్ ఫార్మసీలో నిర్వహించిన మెగా బ్లాడ్ డొనేషన్ క్యాంపును మంత్రి ప్రారంభించారు. రక్తదానంతో పాటు అవయవ దానం పట్ల అవగాహన కల్పించేలా ఫార్మసీ కళాశాలలు కృషి చేయాలని మంత్రి కోరారు. ఫార్మసీ విద్యార్థులు చక్కగా చదువుకోవాలని ఆకాంక్షించారు.