భారతీయ చిత్రసీమపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు కురిపించారు. రష్యాలో ఇండియన్ సినిమాలకు మంచి ఆదరణ ఉందని చెప్పుకొచ్చారు. బ్రిక్స్ సమావేశాల ప్రెస్మీట్లో ఇండియన్ మూవీస్‌పై ఆయన మాట్లాడారు. ‘భారతీయ చిత్రాలను ప్రమోట్ చేసేందుకు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తాం. దీనిపై ప్రధాని మోదీతో చర్చిస్తాం’ అని అన్నారు.