మహారాష్ట్రలో మూడు అస్థిపంజరాలను గుర్తించిన పోలీసులు

573பார்த்தது
మహారాష్ట్రలో మూడు అస్థిపంజరాలను గుర్తించిన పోలీసులు
మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాల్ఘర్ జిల్లాలోని వాడా తాహసీల్‌లోని నెహ్రోలి గ్రామంలో శుక్రవారం ఓ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ ఇంటిలో 70 ఏళ్ల వృద్ధుడు, అతని 65 ఏళ్ల భార్య, 35 ఏళ్ల వారి కుమార్తె శవాలు పూర్తిగా కుళ్లిపోయి అస్థిపంజరాలుగా మారిన అవశేషాలను గుర్తించారు. అయితే ఈ ముగ్గురు ఎలా మరణించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி