ప్రముఖ సామాజిక సేవకులు, రెడ్ క్రాస్ సొసైటీ పెద్దపల్లి శాఖ సభ్యులు బత్తిని అనిల్ కుమార్ తన పుట్టినరోజు పురస్కరించుకుని పెద్దపల్లి పట్టణ కేంద్రంలో గల గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ లో 9 వసారి స్వచ్ఛంద రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ పెద్దపల్లి జిల్లా చేర్మెన్ కావేటి రాజగోపాల్ పాల్గొని అనిల్ కుమార్ ని అభినందించి, యువత రక్తదానాలలో ముందుండి, సమాజానికి ఉపయోగపడాలని కోరారు.