
పెద్దపల్లి: ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: నోడల్ అధికారి
పెద్దపల్లి జిల్లాలో బుధవారం నుండి జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కల్పన మంగళవారం తెలిపారు. జిల్లాలో మొత్తం 23 సెంటర్లలో ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొదటి సంవత్సరం సుమారు 4894, మంది ద్వితీయ సంవత్సరం సుమారు 5636 మంది కలిపి మొత్తం 10,530 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు.