మేటి విద్యార్థులను తయారు చేసేలా ప్రణాళికలు: మంత్రి
మేటి విద్యార్థులను తయారు చేసేలా యంగ్ ఇండియా విద్యా సంస్థల ఏర్పాటు చేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం మంథని మండలం అడవి సోమనపల్లిలో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల పనులకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమ సురేష్ రెడ్డి పాల్గొన్నారు.