ALERT: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

70பார்த்தது
ALERT: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీలోని పలు జిల్లాల్లో శనివారం వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాకినాడ, ఉభయ గోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, అనంతపురం, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మన్యం, అల్లూరి, అనకాపల్లి, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, కర్నూలు, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

தொடர்புடைய செய்தி