మంథని పట్టణ సమీపంలో గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అధ్యాపకులను విద్యార్థినీలు శాలువాతో సత్కరించారు. ఉపాధ్యాయుల గొప్పతనం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కవిత, అధ్యాపకులు రజిత, శ్రీలత, అరుణ శ్రీ శైలజ, విశ్వ శాంతి, సువర్ణ, పూల్ సింగ్, మమత పాల్గొన్నారు.