జమ్మూకశ్మీర్ తదుపరి ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు చేపడతారని ఎన్‌సీ నేత ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (NC) మరియు కాంగ్రెస్ కూటమి ఈ ప్రాంతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా దూసుకెళ్తోంది.. ప్రజలు గొప్ప తీర్పును ఇచ్చారని ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు.