ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుండడంతో నుంచి నిబంధనలు అమలులోకి రానున్నాయి. స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75 వేలతో కలుపుకుని రూ. 12.75 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు దక్కనుంది. బ్యాంకుల్లో డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు జమయ్యే వడ్డీ లక్ష వరకు టీడీఎస్ ఉండగా.. 60 ఏళ్లలోపు వ్యక్తులకు రూ. 50 వేల వరకు నో టీడీఎస్ అమలు కానుంది. ఉపయోగంలో లేని మొబైల్ నంబర్లకు యూపీఐ సేవలను రద్దు చేయనున్నారు.