ఎల్లారెడ్డిలో ఉరుములు మెరుపులు పిడిగులతో కూడిన భారీ వర్షం

65பார்த்தது
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో మంగళవారం ఉదయం నుండి ఎండతో పాటు ఉక్కపోత వేడి గాలులు వీచడంతో ప్రజలు అల్లాడిపోయారు. ఈ క్రమంలో ఒక్కసారిగా మధ్యాహ్నం 2.30గంటల నుండి ఆకాశంలో నల్లని మబ్బులు కమ్ముకొని చీకటిగా మారి ఉరుములు, మెరుపులు, పిడిగులతో కూడిన భారీ వర్షం కురిసింది. 45నిముషాల పాటు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. సోమవారం అర్ధరాత్రి సైతం ఇదే తరహాలో వర్షం పడింది.

தொடர்புடைய செய்தி