నేటి యువతకు ఆదర్శం స్వామీ వివేకానంద

324பார்த்தது
నేటి యువతకు ఆదర్శం స్వామీ వివేకానంద
యువతకు స్పూర్తి ప్రధాత స్వామీ వివేకానందుడని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజెస్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.బాలాజీ రావు అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రం లోని సాంధీపని కళాశాలలో జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ ఇందూర్ సంస్థ ఆద్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలాజీరావు ముఖ్య అతిధిగా హాజరై విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. వివేకానందుని జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ చదివి స్పూర్తి పొందాలని, భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు వివేకానందుడని అన్నారు. దేశ గొప్పదనం తెలుసుకోవాలంటే వివేకానందుని గురించి తెల్సుకోవాలని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన మాటలను ఈ సందర్భంగా బాలాజీరావు గుర్తు చేశారు. విద్యార్థులు సమయపాలన పాటిస్తూ క్రమశిక్షణతో ముందుకు సాగాలని ఉద్బోదించారు. ఈ కార్యక్రమంలో సాంధీపని కళాశాల డైరెక్టర్ అశోక్ రావు, ఇంటర్, డిగ్రీ ప్రిన్సిపాల్ లు సాయిబాబా, ప్రవీణ్ కుమార్, జేసిఐ ఇందూర్ అధ్యక్ష కార్యదర్శులు తిరునగరి శ్రీహరి, తక్కూరి హన్మాండ్లు, పూర్వాద్యక్షులు చింతల గంగాదాస్, ప్రోగ్రాం చైర్మెన్ నరహరి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி