ఎయిడ్స్ పట్ల ముందస్తు అవగాహన తప్పనిసరి: డాక్టర్ విశాల్

8564பார்த்தது
ఎయిడ్స్ పట్ల ముందస్తు అవగాహన తప్పనిసరి: డాక్టర్ విశాల్
నిజామాబాదు జిల్లా ఎయిడ్స్ వ్యాధి పట్ల ముందస్తు అవగాహన తప్పనిసరి అని ప్రముఖ న్యూరోసైకియాట్రిస్ట్, భారత మానసిక సమాజపు జాతీయ కన్వీనర్ డాక్టర్ ఆకుల విశాల్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మిర్చి కాంఫౌండ్ లో గల బాలుర వెనుకబడిన తరగతుల సంక్షేమ కళాశాల వసతి గృహంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైబ్రంట్స్ ఆఫ్ కలామ్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి రాకుండా ముందస్తు అవగాహన ముఖ్యమని, తెలిసి తెలియని వయసులో చెడు తిరుగుళ్లకు దూరంగా ఉంటూ కెరీర్ పై దృష్టి సారించాలన్నారు. చెడు స్నేహాల ప్రోద్భలంతో క్షణికావేశాలకు లోనై భవిష్యత్తును పాడుచేసుకోవదన్నారు. మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకొని సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా సమన్వయకర్త తక్కూరి హన్మాండ్లు, వసతి గృహ అధికారి మచెందర్, శేఖర్, నరహరినాయక్ తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி