నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కేంద్రంలో మంగళవారం మండల కార్యాలయంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. 2023-24 సంవత్సరంలో మండలంలోని వివిధ గ్రామపంచాయతీలో జరిగిన ఉపాధి హామీ పనులు, వాటికైన ఖర్చులు వివరాలను సభలో ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ అభివృద్ధి అధికారి సాయిగౌడ్, స్టేట్ టీం మానిటరింగ్ అధికారి అంజన్, ఎంపీడీవో రాములు, ఎంపీఓ కిరణ్ కుమార్, కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.