నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో బుధవారం తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మానవహారాన్ని నిర్వహించి నిరసన వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు హరి ప్రసాద్ మాట్లాడుతూ ప్రైవేట్ కళాశాలల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరసనలో కో-ఆర్డినేటర్ నరాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.