సిపిఐ ఎంఎల్ ప్రజపంథ ఆద్వర్యంలో ధర్నా

1574பார்த்தது
మండలంలోని చుట్టు పక్కన ఉన్న గ్రామాలలోని నిరుపేదలు, ఇండ్లు లేని వారు, భూమి లేని వారు, రేషన్ కార్డులో పేరు లేని వారు గురువారం సిపిఐ ఎంఎల్ ప్రజపంథ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దారుకు మెమోరాండం సమర్పించారు. అనంతరం రామకృష్ణ రమేష్ మాట్లాడుతూ ముక్కిన బియ్యం తిన్నం, నాము పురుగులు వచ్చిన బియ్యం తిన్నం, ఇప్పుడు ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి. ఇవి ఎలా తినాలొ అర్ధం కావడంలేదు. ఇప్పటికైనా మా పై కనికరించి మంచి బియ్యం సన్నని బియ్యం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. భూమి లేని వారికి భూమి కొని ఇల్లుకట్టుకోవడానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పేదలను అదుకోవాలి అని డిమాండ్ చేసారు.కార్యక్రమంలొ ప్రజ పంథ నాయకులు సాయి రెడ్డి, ప్రజలు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி