దేగాం పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

81பார்த்தது
దేగాం పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ విభాగాలను సందర్శించి పనితీరును పరిశీలించారు. ల్యాబోరేటరీలో రక్త పరీక్షలు నిర్వహిస్తున్న విధానాన్ని గమనించి, టెక్నీషియన్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యాధి నిర్ధారణ కోసం స్థానికంగానే యంత్రాలను వినియోగిస్తుండడాన్ని గమనించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி