నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్ లో గల ప్రభుత్వ బాలుర, బాలికల ఐ. టీ. ఐ ప్రాంగణాలలో నూతనంగా నిర్మిస్తున్న ఏటీసీ భవన సముదాయాల నిర్మాణ పనులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ (ఏటీసీ) నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.