కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ పట్టణంలోని శ్రీ విఠలేశ్వరాలయంలో శుక్రవారం ఉదయం శ్రీ రుక్మిణి పాండురంగ కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో పండరీపూర్ సాంప్రదాయం ప్రకారం గత నెల రోజులుగా కాకడ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం రేపటితో ముగియనుండగా.. భక్తులు ప్రత్యేక పూజలు చేసి, ఆశీర్వాదాలు తీసుకున్నారు.