సామాజిక మాద్యమాలతో జాగ్రత్త: ఎస్ఐ ఆషిఫ్

301பார்த்தது
సామాజిక మాద్యమాలతో జాగ్రత్త: ఎస్ఐ ఆషిఫ్
కామారెడ్డి జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలోని శ్రీ విద్య సాయి హై స్కూల్ లో శనివారం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కమ్మర్పల్లి ఎస్ ఐ ఆషిఫ్ ముఖ్య అతిథిగా, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు తిరునగరి శ్రీహరి ప్రధాన వక్తగా విచ్చేసారు. ముందుగా ఎస్.ఐ మాట్లాడుతూ విద్యార్థులు గొప్ప లక్ష్యాన్ని కలిగి ఉండాలని, చదువుకునే వయసులో చెడు స్నేహాలు మానుకోవాలన్నారు. చిన్నతనం నుండే మొబైల్ వాడకం మంచిది కాదని సామాజిక మాధ్యమాల ద్వారా ఏర్పడే పరిచయాలతో జాగ్రత్తగా ఉండాలని చదువు పైనే ఎక్కువ దృష్టి సారించి మంచి లక్ష్యాలను చేరుకోవాలన్నారు. అనంతరం శ్రీహరి మాట్లాడుతూ అమ్మాయిల భద్రత పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వారి విద్య భవిష్యత్తుకు తల్లిదండ్రుల పాత్ర మరియు కెరీర్ గైడెన్స్ గురించి వివరించారు. అనంతరం వైబ్రెంట్స్ ఆఫ్ కలామ్ సంస్థ వారు రూపొందించిన బాలికలను, మహిళలను గౌరవించాలనే కరపత్రాలను ఆవిష్కరించి, ప్రతిభ కలిగిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైబ్రంట్స్ ఆఫ్ కలామ్ జిల్లా సమన్వయకర్త తక్కూరి హన్మాండ్లు, రమేష్ యాదవ్, కరస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, పవన్, బాలు, నరహరి తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி