బీజేపీ శాసనసభ పక్ష నేతగా నియమితులైన నిర్మల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గురువారం హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి అభినందించారు. ఇందులో ఎమ్మెల్సీ ఏబీఎన్ రెడ్డి శాసనసభ ఎల్పీ ఉప నేత పాయల శంకర్ విప్ పాల్వాయి హరీష్ బాబు, కార్యదర్శి ఎమ్మెల్యే రామారావు పాటిల్ తదితరులున్నారు.