కల్లూరులో ఘనంగా మహిళా దినోత్సవం

953பார்த்தது
కల్లూరులో ఘనంగా మహిళా దినోత్సవం
కుంటాల మండలంలోని కల్లూరు లో వివేకానంద విద్యానికేతన్ ఎస్ఎంఎస్ పాఠశాలలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా పాఠశాలలో ఉన్న మహిళ ఉపాధ్యాయనీలకు పాఠశాల యాజమాన్యం శాలువాతో సత్కరించారు మరియు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గజానన్ మాట్లాడుతూ.. సృష్టికి మూలం మహిళలని , మహిళలు సాధికార ప్రసాదించినప్పుడే సమాజం అభివృద్ధి చేస్తుందని నేడు అన్ని రంగాలలో మహిళలు ముందుకు దూసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ అంబకంటి శ్రీకాంత్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி