తానూర్ మండలంలోని జవుల (బి) గ్రామం తెలంగాణ మహారాష్ట్ర బోర్డర్లో ఎస్ఐ సందీప్ గురువారం తనిఖీలు చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలన్నారు. మైనర్లకు వాహనాలను ఇవ్వకూడదని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.