కుంటాల మండలం పెంచికాల్పాడులో బుధవారం బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరికి విద్యుత్ జీరో బిల్లును అమలు చేయాలని కరపత్రాలతో నిరసన తెలిపారు. బీజేపీ మండల కార్యదర్శి సూర్య వంశీ సాయినాథ్ పటేల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకంలో భాగంగా ప్రభుత్వం చేసిన తప్పిదాలను సాంకేతిక కారణాల సాకుతో అధిక బిల్లు వసూలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యుడిపైనే తన అధికారాన్ని చేలాయిస్తోందన్నారు.